Monday, March 30, 2020

అన్వేషి



గతాల పుటల్లోంచి   వెలికి తీసిన నిజాలు
మతాల మాటున జరుగుతున్న మోసాలు

రాజుల అభిమతాల చాటున నలిగిన సామాన్యుల ఆర్తనాదాలు
కోణాల్లోంచి, దృక్కోణాల్లోంచి రాయబడ్డ చరిత్రలు

నియంతృత్వాన్ని ధిక్కరించిన అమర ప్రేమికుల జీవితాలు
నిజాలను నినదించిన  ధైర్యవంతుల గళాలు

అధికారాన్ని ప్రశ్నించిన తిరుగుబాటు బావుటాలు
అహంకారాల హుంకారాల కిందపడి నలిగిన వీరుల స్వరాలు

ఉద్యమ సూర్యులు ఊపిరిలొదిలినా చోద్యం చూసిన సమాజాలు
నరహంతకుల దురాగతాలకు మూగవోయిన విప్లవ శంఖాలు

ప్రాణ త్యాగాల విలువను మరచిన జాతి వంచకుల సమూహాలు
అన్వేషించే కొలది దొరికే నిజాల సమాధులు ........

25 comments:

  1. Chaalaaa chaalaaa bagunnayi sir , mee aalochanaa vidanam ,mee idiology chaalaaa chakkagaa undi sir god bless you

    ReplyDelete
  2. Really good one, you are like one more Sri Sri to us, god bless you and please do share more...!!

    ReplyDelete
  3. Wow....
    Nijaalani aksharalalo sootigaa varninchina teeru amogham.

    ReplyDelete
  4. చాలా భాగుంది సార్, కానీ అన్వేషి కి అంతం లేదనుకుంటా

    ReplyDelete
  5. Nijamina nagna satyaalu!! Hats off Murali

    ReplyDelete
  6. Chala super ga vunnai .murali very nice

    ReplyDelete
  7. Oh great Murali.

    Krishna Murthy, RM TSRTC Khammam

    ReplyDelete
  8. మీ అన్వేషణ లో మావంటి పాఠకులకు దొరికిన మరో ఆణిముత్యం లాంటి కవిత... ఎంతో భావుకతతో వ్రాసావు...

    ReplyDelete
  9. మీ అన్వేషణ లో మావంటి పాఠకులకు దొరికిన మరో ఆణిముత్యం లాంటి కవిత... ఎంతో భావుకతతో వ్రాసావు...

    ReplyDelete
  10. Revolutionary writing from soul

    ReplyDelete
  11. Excellent aanna ..
    Ati takkuva words lo
    Middival period common man kastalu
    Questioning nature vunna valla lifes ela end ayyiptayi chupicharu

    ReplyDelete
  12. కులాల,మతాల మాటున మనలో కుళ్ళుని నింపుతున్న కొందరి స్వార్ధపరుల గురించి.......
    రాజుల పాదాల క్రీంద నలిగినా సామాన్య ప్రజల గొంతులు......
    ప్రేమిచుకున్నాం అంటే బ్రతికుండగానే సమాధి కట్టిన నీచ చరిత్ర గురించి.........
    అధికారాన్ని ప్రశ్నించి ఉరితడుకు వేలాడిన వీరుల గురించి......
    భానిసత్వాన్ని ఏదిరించి తుపాకీ గుండ్లకు బలిఐన అమర వీరుల గురించి..........
    వీటి అన్నిటిని...రాజులను,సామంతులను, నియంతలను,ఏదిరించి,ప్రాణాలువడ్డి,నిత్యం అన్వేషణ చేసి సాధించిన స్వాతంత్ర్యం మనది.......ఇంత అర్ధం ఉంది మీరు చెప్పినా ఈ అన్వేషి......
    జై భారత్

    ReplyDelete
  13. Nice poetry annaya...Plz compose poetry on poverty and democracy....

    ReplyDelete
  14. It is very near to human mentality!
    Simply it is superb!

    ReplyDelete