శాపం
ఎవరిదీ పాపం
ఎవరి పై కోపం
ఎందుకీ శాపం
ఎవరి పై కోపం
ఎందుకీ శాపం
మహమ్మారి వచ్చేనంట
మనిషి కెమో తెచ్చే తంటా
మనిషి మనిషి కి దూరమంట
చేయి చేయి కలపలేమంట
విషపు జ్వాలలు చిమ్మేనంట
మృత్యు వాకిలి తెరిచెనంట
మసక బారిన మనిషి మనసు
దిగులు తోనే గుండెలలుసు
మాయమైన పసిడి నవ్వులు
ఆట మరచిన పసి వయస్సులు
ఆట మరచిన పసి వయస్సులు
ఎవరి కుట్రలు దాగెనిచట
ఎవరి బ్రతుకులు ఆగెనిచట
ఎవరిదీ పాపం
ఎవరి పై కోపం
ఎందుకీ శాపం