Monday, March 30, 2020

అన్వేషి



గతాల పుటల్లోంచి   వెలికి తీసిన నిజాలు
మతాల మాటున జరుగుతున్న మోసాలు

రాజుల అభిమతాల చాటున నలిగిన సామాన్యుల ఆర్తనాదాలు
కోణాల్లోంచి, దృక్కోణాల్లోంచి రాయబడ్డ చరిత్రలు

నియంతృత్వాన్ని ధిక్కరించిన అమర ప్రేమికుల జీవితాలు
నిజాలను నినదించిన  ధైర్యవంతుల గళాలు

అధికారాన్ని ప్రశ్నించిన తిరుగుబాటు బావుటాలు
అహంకారాల హుంకారాల కిందపడి నలిగిన వీరుల స్వరాలు

ఉద్యమ సూర్యులు ఊపిరిలొదిలినా చోద్యం చూసిన సమాజాలు
నరహంతకుల దురాగతాలకు మూగవోయిన విప్లవ శంఖాలు

ప్రాణ త్యాగాల విలువను మరచిన జాతి వంచకుల సమూహాలు
అన్వేషించే కొలది దొరికే నిజాల సమాధులు ........

Sunday, March 29, 2020

మౌనం



మనసుకి మాటకి మధ్యలొ నలిగిపొయిన భావలెన్నొ 
మౌనంగా మిగిలిపొయిన రుపాలెన్నొ
కాలం తొ కరిగిపొయిన జ్ఞ్యాపకాలెన్నొ

కన్నులు చెలమలైన రాత్రులు ఎన్నొ
కళ్ళు   తెరిస్తె మాయమైన కలలెన్నొ

గుండె సవ్వడిని మించి వినిపించిన అందెల సవ్వడులెన్నొ
నీవు నడచిన దారిలొ వికసించిన సుమాలెన్నొ

నీ ఇంటివైపు నిశిరాత్రిలొ కుడా నే వెసిన అడుగులెన్నొ
నిన్ను చూసి నన్ను నేను మరచిన క్షణాలెన్నొ     

నీ గుర్తింపు కోసం నేను చెసిన ప్రయత్నాలెన్నొ 
నాకొసం నీమీద నే రాసుకున్న కవితలెన్నొ

నీతొ చెప్పే ధైర్యం లేక నాతొ నేను చెసిన యుధ్హాలెన్నొ 
నీ కొసం నే నిర్మించిన కలల సౌధా లెన్నొ

నన్ను వదిలి వెళ్తు ఛిధ్రమైన  నా మదిలొ సృష్టించిన  ప్రకంపనలెన్నొ   
మనసుకి మాటకి  మధ్య నలిగిపొయిన భావాలెన్నొ