Sunday, March 29, 2020

మౌనం



మనసుకి మాటకి మధ్యలొ నలిగిపొయిన భావలెన్నొ 
మౌనంగా మిగిలిపొయిన రుపాలెన్నొ
కాలం తొ కరిగిపొయిన జ్ఞ్యాపకాలెన్నొ

కన్నులు చెలమలైన రాత్రులు ఎన్నొ
కళ్ళు   తెరిస్తె మాయమైన కలలెన్నొ

గుండె సవ్వడిని మించి వినిపించిన అందెల సవ్వడులెన్నొ
నీవు నడచిన దారిలొ వికసించిన సుమాలెన్నొ

నీ ఇంటివైపు నిశిరాత్రిలొ కుడా నే వెసిన అడుగులెన్నొ
నిన్ను చూసి నన్ను నేను మరచిన క్షణాలెన్నొ     

నీ గుర్తింపు కోసం నేను చెసిన ప్రయత్నాలెన్నొ 
నాకొసం నీమీద నే రాసుకున్న కవితలెన్నొ

నీతొ చెప్పే ధైర్యం లేక నాతొ నేను చెసిన యుధ్హాలెన్నొ 
నీ కొసం నే నిర్మించిన కలల సౌధా లెన్నొ

నన్ను వదిలి వెళ్తు ఛిధ్రమైన  నా మదిలొ సృష్టించిన  ప్రకంపనలెన్నొ   
మనసుకి మాటకి  మధ్య నలిగిపొయిన భావాలెన్నొ  

30 comments:

  1. Nijam ga enno bhavalu tatti leparu awesome

    ReplyDelete
  2. చాలా బాగా రాస్తున్నారు...ఇంకా రాయాలి..పై కవిత ని కొనసాగించాలి

    ReplyDelete
  3. నీలో దాగిఉన్న కవిని మరోసారి తట్టిలేపావు.... ఇటువంటివి మరిన్ని నీ కలం నుండి జాలువారాలని ఆశిస్తూ....

    ReplyDelete
  4. హృదయాంతరాల్లోని భావావేశపు పరిమళాలు..
    ఉత్తుంగ తరంగాలై మీకలంనుండి జాలువారుతూ..
    మా మనసుల్లోకి చొచ్చుకొని వచ్చి..
    ఏదో తెలియని వింత అనుభూతికి గురిచేయుచున్నది..
    మరిన్ని కవితాకుసుమాలు మీ కలంనుండి జాలువారాలని కోరుకుంటూ...



    ReplyDelete
  5. Nice one Babai! Keep it up ��. Expecting many more from you

    ReplyDelete
  6. హృదయంలో మౌన బావుకతకు అక్షర రూపంలోకి అనువదించిన మనసు కవికి నా ప్రత్యేక అభినందనలు...కల్లుపల్లి సురేందర్ రెడ్డి, జర్నలిస్ట్

    ReplyDelete
  7. Superb babay...should have started writing long back as I have seen in way back 2005 ..but it's gud ..many more expecting from u ...with luv...

    ReplyDelete
  8. Murali Krishna garu nijamgaaa gunde lotulloonunchi jaluvarina mee kavithaa samputi chaalaaa bagunnayi ,meeru inkaaaa yennooo kavithalu raayaalani manaspoortigaa korutunnaanu sir

    ReplyDelete
  9. Hari Krishna vemireddi Bhimavaram

    ReplyDelete
  10. Hari Krishna vemireddi Bhimavaram

    ReplyDelete
  11. Congrats on starting your blog.
    "mounam" expresses many feelings of heart beautifully.
    the strings of words are really charming and captivating.
    I wish should write more regularly.
    with best wishes,
    Mallikarjun.

    ReplyDelete
  12. సర్.... పాత భావాల్ని... జ్ఞాపకాల్ని...కలల్ని... గుర్తు చేస్తున్నారు.... ధన్యవాదాలు!!💐💐💐
    ఇటువంటివి మరిన్ని మీ కలం నుండి జాలువారాలని ఆశిస్తూ.... All da Best, Sir....

    -- కె.సి. రవి కుమార్

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. Congratulations Annaya on starting Nadanvanam blog...
    I wish this blog would generate some interesting poetries in future and act like a bridge to connects the telugu linguaphiles digitally..

    ReplyDelete
  15. ఈ నందనవనం లో, మీ భావాలు చల్లని చినుకుల్లా, గుప్తమైన మొగ్గలను చేరీ, వేల పుష్పాలలా పరిమలించలని ఆశిస్తున్నాను. 😊

    ReplyDelete
  16. Great Murali, I'll watch your blog regularly

    ReplyDelete
  17. Jnaapakaalanu tattilepina kavita ����

    ReplyDelete
  18. Smplyyy superbb.. Nee kalam lo daagina adbhutaalinkenno...sincerely proud of you..

    ReplyDelete