Tuesday, November 2, 2021

శాపం





శాపం

ఎవరిదీ పాపం
ఎవరి పై కోపం
ఎందుకీ శాపం

మహమ్మారి వచ్చేనంట
మనిషి కెమో  తెచ్చే తంటా

మనిషి మనిషి కి దూరమంట
చేయి చేయి కలపలేమంట

విషపు జ్వాలలు చిమ్మేనంట
మృత్యు వాకిలి తెరిచెనంట

మసక బారిన మనిషి మనసు
దిగులు తోనే గుండెలలుసు

మాయమైన పసిడి నవ్వులు
ఆట మరచిన పసి వయస్సులు

ఎవరి కుట్రలు దాగెనిచట
ఎవరి బ్రతుకులు ఆగెనిచట

ఎవరిదీ పాపం
ఎవరి పై కోపం
ఎందుకీ శాపం

 


12 comments:

  1. పోలీస్ ఆఫీసర్ గా చూసిన కరోనా కల్లోలం ని చాలా సరళంగా వివరించి అలరించావ్ మురళీ .. ఇంకా ఇలాంటివి ఎన్నో నీ కలం నుంచి జాలువారాలి అని ఆశిస్తూ

    ReplyDelete
  2. కవి అవేదన చాలా బాగుంది. త్వరలోనే ఈ ప్రపంచానికి కరొన నుండి ముక్తి దొరకాలని ఆశిస్తూ....

    ReplyDelete
  3. సంఘవ్యతిరేకశక్తులపై గన్నుఎక్కిపెట్టే'మురళీకృష్ణుడు' మానవాళి పాలిట మరణమృదంగం మ్రోగిస్తున్న కరోనా మహమ్మారిపై కలం ఎక్కిపెట్టడం అభిలషణీయం.ఈ కవితలోని ప్రతీపదం వెనక కవిలోని ఆర్తి,ఆర్ద్రత కనపడుతున్నాయి.సి.నారాయణరెడ్డి(సినారె)తర్వాత మానవతావాదాన్ని ముందుకు తీసుకువెళుతున్న మురళీకృష్ణగారికి అభినందనలు.

    ReplyDelete
  4. చక్కని కవిత బాబాయ్

    ReplyDelete
  5. బావుంది అన్నా.����

    ReplyDelete
  6. బావుంది అన్నా.👌👌

    ReplyDelete
  7. బాగుంది అన్నా...

    ReplyDelete